రోడ్డు ప్రమాదంలో ఓ ఊరు మొత్తం తగలడిపోయింది!
posted on Aug 23, 2025 @ 9:51AM
పంజాబ్ లో అత్యంత ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఓ ఊరు మొత్తం దాదాపు తగలడిపోయింది. పలువురు గాయపడ్డారు. మరింత మంది గల్లంతయ్యారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య భారీగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. వివరాలిలా ఉన్నాయి.
పంజాబ్ హోషియార్‌పూర్‌లోని మాండియా పారిశ్రామిక వాడ సమీపంలో ఎల్‌పిజి ట్యాంకర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ వెంటనే గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘోర సంఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.