జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు.. బెయిల్ రద్దు?
posted on Apr 28, 2021 @ 5:49PM
ఏపీ సీఎం జగన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై వివరణ కోరుతూ సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘిస్తున్నారని రఘురామ పిటిషన్‌లో తెలిపారు. వచ్చే నెల 7న సీబీఐ కోర్టు పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
జగన్‌కు రోజులు దగ్గర పడుతున్నట్టున్నాయ్. జగన్ బెయిర్ రద్దు పిటిషన్‌ను మంగళవారం సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం నోటీసులు జారీ చేసింది. బయట ఉంటే జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషినర్. వెంటనే బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్ తరఫు అభ్యర్థనలు విన్న న్యాయస్థానం.. కేసును విచారణకు స్వీకరించింది. తాజాగా నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.
నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.
రఘురామకృష్ణంరాజు.. కొన్ని రోజులుగా సీఎం జగన్‌రెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వ ప్రోద్బంలంతో ఈడీ రైడ్స్ జరుగుతున్నా..కేసులు పెడుతున్నా.. ఏమాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు.. వెనక్కి తగ్గడం లేదు. జగన్ అనుసరిస్తున్న విధానాలపై, అడ్డగోలు పాలనపై దాదాపు ప్రతీరోజు విమర్శలు చేస్తుంటారు. ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకున్నా.. వైసీపీ ఎంపీగా ఉంటూనే.. వన్ మ్యాన్ ఆర్మీలా.. జగన్‌రెడ్డిపై మడమ తిప్పని పోరాటం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు రఘురామ. తాజాగా, ఆయన దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడం, జగన్‌కు నోటీసులు జారీ కావడంతో ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్టైంది. రఘురామ తలుచుకుంటున్నట్టుగానే.. త్వరలోనే జగన్ బెయిల్ రద్దు అవుతుందా? జగన్ మళ్లీ జైలుక వెళ్లక తప్పదా? ఏమో.... ఏదైనా జరగొచ్చు.