కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం డెడ్ లైన్..
posted on Oct 3, 2016 @ 1:01PM
తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరి నీటి జలవివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కర్ణాటక ప్రభుత్వ తీర్పుపై మండిపడింది. గత విచారణలోనే తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఇదే ఆఖరి అవకాశమని చెప్పినా కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని చెబుతోంది. సీఎం సిద్దరామయ్య ఈ ఉదయం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకోకుండా నదిపై ప్రాజెక్టులు నిర్మించుకుంటే, ఇప్పుడు బలిపశువుగా మారినట్లయిందని.. తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఉన్న నీరు తాగు అవసరాలకు కూడా పరిస్థితి లేదని, ఇక దిగువకు నీరెలా ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఈరోజు దీనిపై విచారించిన సుప్రీం కర్ణాటక సర్కార్ కు డెడ్ లైన్ విధించింది. ప్పటివరకూ తమిళనాడుకు ఎంత నీరు వదిలారు? అసలు వదిలారా? లేదా అన్న విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తెలియజేయాలని న్యాయమూర్తి డెడ్ లైన్ విధించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని కూడా కోర్టు హెచ్చరించింది. మరి దీనిపై కర్ణాటక సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.