కేజ్రీ బాటలో సోరేన్.. బలపరీక్షలో విజయం
posted on Sep 5, 2022 @ 5:06PM
బీజేపీ కుట్రలను ఛేదిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పద్ధతిలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అడుగు ముందుకు వేసారు. అసెంబ్లీలో హేమంత్ సోరెన్ సర్కార్ బల నిరూపణలో విజయవంత మయింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార కూటమికి 49 ఓట్లు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సోరెన్ శాసన సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. సోరెన్ శాసనసభ్యత్వం పై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ లోపు తన ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయ త్నాలు జరుగు తున్నాయని హేమంత్ సోరెన్ బలపరీక్షకు దిగారు. తాను బలపరీక్షలో నెగ్గడంతో ఇక మరో ఆరు నెలల వరకూ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు.
కాగా, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కి సిఫారసు చేసిన క్షణం నుంచీ తన ప్రభు త్వాన్ని కాపాడుకునేందుకు ఆధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ వెళ్లిన 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి రాంచీకి చేరుకున్నారు. రాయ్‌పుర్ నుం చి ఛార్టెడ్ విమా నంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాంచీకి చేరుకున్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధ మయ్యా రు. గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోవటం, బీజేపీ తీరు పైన జార్ఖండ్ అధికార పార్టీ అనుమా నాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు యూపీఏ ఎమ్మె ల్యేలు విజ్ఞప్తి చేశారు.
కాగా సోమవారం (సెప్టెంబర్ 5) సోరేన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష లో విజయం సాధించింది. సోరేన్ ప్రభు త్వానికి మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవలం ఈ పరీక్షను ఎదుర్కొనేందుకే ముఖ్య మంత్రి సోరేన్ సోమవారంనాడు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన ప్రభుత్వం సభా విశ్వా సాన్ని కోరుతూ ఆయన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ బిజెపి పై విరుచుకు పడ్డారు. ఆ పార్టీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యంపోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని కల్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని హేమంత్ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ జార్ఖండ్ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నారని ఆయన ఆరోపించారు.