Read more!

డయాబెటిస్ వున్నవారు మామిడి పండ్లను తినొచ్చా?

దయాబిటిస్ రోగులకు పచ్చుమామిడి లాభదాయకమని నిపుణులు అంటున్నారు.ఇమ్యునిటీ పెంచడం లో పచ్చిమామిడి కీలక పాత్రపోషిస్తుందని నిపుణులు అంటున్నారు.పచ్చిమామిడిలో తక్కువ సంఖ్యలో చక్కెర కాల్షియం లభిస్తుంది.

పచ్చిమామిడి తో మేలైన లాభాలు...

డయాబెటిస్ రోజులకు పచ్చిమామిడి వల్ల మేలైన లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మామిడి ఎలాంటిది అంటే చూడగానే ఎప్పుడెప్పుడా మామిడి ని తిందామా అని నోరు ఊరిస్తూ ఉంటుంది అది పచ్చి మామిడి అయినా పండుమామిడి పండినా ఒద్దు అని అనని వారు ఎవరుంటారు చెప్పండి.మీకు తెలుసా పచ్చి మామిడి ఎంత రుచిగా ఉంటుందో ఒకపక్క పులుపు మరోపక్క పీచుపదార్ధం ఆపైన ఉప్పు కారం తీసుకుని తింటే ఉంటుంది మళ్ళీ ఎప్పుడూ దొరకదేమో అన్నంతగా మామిడి కాయను లాగించేస్తూ ఉంటారు మామిడి ప్రియులు.అసలు పచ్చి మామిడిఎంత లా భదాయకమో మీకు తెలుసా ఒక రిపోర్ట్ ను అనుసరించి పచ్చిమామిడిలో చక్కర క్యాలరీలు,కార్బో హైడ్రేడ్స్,వంటివి చాలా తక్కువ మొతాదులో ఉంటాయి.అది డయాబెటిస్ రోగులకు అవసరం దీంతోపాటు పీచుపదార్ధం చాలా ఎక్కువశాతం విటమిన్ సి,పుష్కలం గా ఉంటుంది.శరీరంలో ని మెటాబాలిజం మెరుగు పరచడం లో పచ్చిమామిడి దోహదం చేస్తుంది.దీనితో పాటు అరుగుదల పద్దతిని మెరుగు పరుస్తుంది.చక్కర పెరుగుదలను నియంత్రిస్తుంది. అలాగే పొట్టలో ఏర్పడే అనారోగ్య సమస్యను నియంత్రిస్తుంది.

పచ్చిమామిడి లాభాలు...

డయాబెటిస్ రోగులకు లాభ  దాయకం.డయాబెటిస్ రోగులకు పచ్చిమామిడి అత్యంత లాభదాయకం కాగలదు.తక్కువ శాతం క్యాలరీలు ,కార్బో హైడ్రేడ్స్,తక్కువగా లభిస్తాయి.అది డయాబెటిస్ రోగులకు చాలా అత్యవసరం.డయాబెటిస్ ను నియంత్రించడం లో సహాయ పడుతుంది. మధు మెహ రోగులు కోసిన ఒక కప్పు మామిడి కాయ తినవచ్చు.ఎప్పుడైనా తినవచ్చని సూచిస్తున్నారు.

ఇమ్యునిటి పెంచడం లో సహాయ పడుతుంది...

ఇందులో పూర్తి స్థాయిలో విటమిన్ సి విటమిన్ ఏ,మెగ్నీషియం లభ్యమౌతాయి.శరీరం లో ఇమ్యునిటీ ని పెంచడం లో సహాయపడుతుంది. పచ్చి మామిడి కాయను తీసుకోవడం వల్ల కొలస్ట్రాల్,హార్ట్ అట్టాక్ నుంచి రక్షిస్తుంది.కాళ్ళ నొప్పులకు పచ్చి మామిడి ఉపయుక్తమే అని  అంటున్నారు.

పొట్టకు లాభదాయకం...

పొట్ట సంభందిత సమస్యలను నిలువరించడం లో సహాకరిస్తుంది.పొట్టలో వచ్చే ఇతర సమస్యలు గ్యాస్,అల్సర్స్,అమీబియాసిస్,లేదా ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించడం లో పచ్చి మామిడి ఉపయోగ పడుతుంది.

లూ సమస్య నుండి రక్షించడం లో సహాయ పడుతుంది...

వేసవి కాలం లో పిల్లలు మామిడి ముక్కలు ముఖ్యంగా పచ్చి మామిడి కాయ.లేదా మామిడి తో చేసిన ఇతర వంటకాలు,మామిడి కాయ పచ్చడి దొరికిందో ఈ వాతావరణం లో పచ్చిమామిడి కాయను ఉడికించి దానితో చేసే రసం తీసుకోవడం వల్ల లూ వచ్చే అవకాశం తగ్గుతాయి పచ్చి మామిడి రసం తీసుకోవడం వల్ల వడదెబ్బ తగల కుండా ఉంటుంది.పచ్చి మామిడి రసం మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.శరీరం 
హైడ్రేడ్ కాకుండా పచ్చి మామిడి సహకరిస్తుంది. ఆయుర్వేదం లో సైతం పచ్చిమామిడి లోని ఔషద గుణాల గురించి వివరించినట్లు సమాచారం.ముఖ్యంగా ఆవకాయ పచ్చడి చేసే వారు వాడే దినుసులలో ఆవ పొడి,మెంతిపొడి,పసుపు,ఖారం,నువ్వుల నూనె తో చేసిన మామిడి పచ్చడి వేసవి కాలం లో వేడి చేసే గుణం ఉంటుంది కనుక వేసవిలో చలువ చేసేందుకు మెంతిపొడి వాడతారు.అదీ కాక ఆవకాయ సరైన పద్దతిలో తయారు చేస్తే వర్షాలు పడిన తరువాత మాత్రమే ఆవకాయ ను తినడం ఆనవాయితి అప్పటి వరకూ ఊరబెట్టి తినడం వల్ల ఆరుచివేరని ఆరోగ్యపరంగా కొందరు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారిలో అవకయ పచ్చడి నిషిద్ధమని ప్రముఖ వైద్యులు సూచించారు. మేలైన లాభాలు ఇచ్చే పచ్చిమామిడి ఆరోగ్యప్రదాయని.