చల్లటి నీరు ఆరోగ్యానికి మంచిదేనా?

వేసవికాలం లో ఎండా వేడిమి తట్టుకోడానికి కాస్త ఏదైనా చల్లగా తాగాలని అందరూ అనుకుంటారు. అప్పుడే దాహం తగ్గుతుందని అనుకుంటారు.ఇంకొందరికి చల్లటి మంచినీళ్ళు అన్ని కాలాలలో తాగడం అలవాటు. చల్లటి నీళ్ళు అంటే కుండలో నీళ్ళు తాగడం కాదు,లేదా కొందరు ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగితేనే తృప్తి అయితే ఎర్రటి ఎండలో కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యుక్తవయస్సులో దాని ప్రభావం పెద్దగా ఉండదు కాని వయస్సు పెరిగే కొద్ది ఖచ్చితంగా దీని ప్రభావం లివర్ మీద ఉంటుందని అలాగే చల్లటి కూల్ డ్రింక్స్,కూలింగ్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే హార్ట్ ఎట్టాక్ కి దారి తీస్తుందని జపాన్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జపాన్ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఎండాకాలం లో చల్ల చల్లగా కూల్ డ్రింక్స్,బీర్లు,ఐస్ క్రీంలు,కూల్ కాఫీ,ఇవి చాలా ప్రమాదకర కరమైనవి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చల్లని నీరు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు...

మన శరీర ఉష్ణోగ్రతకు సరిపడా సమాన మైన నీటిని మాత్రమే తాగాలి. గోరు వెచ్చటి నీటిని౩7 డిగ్రీల నీరు తాగాలి అలాకాకుండా కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగడం వల్ల అది పొట్టలోకి చేరి పొట్టలో ఉన్న జఠరాగ్ని చల్ల బరుస్తుంది.జఠరాగ్ని చల్ల బడిందో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు ఈకారణం గానే పొట్టలో సమస్యలు వస్తాయి ఒక ఉదాహరణగా చెప్పాలంటే బాగా మండుతున్న పొయ్యిమీద అన్నం ఉడుకుతుంటే మధ్యలో అనిప్పులమీద నీళ్ళు పోస్తే ఏమౌతుంది పొయ్యి ఆరిపోతుంది అన్నం సరిగా ఉడకదు.జఠరాగ్ని మీద చల్లటి కూల్ కూల్ ఐస్ వాటర్ పోస్తే జఠరాగ్ని చల్లబడడమే కాదు తీసుకున్న ఆహారం అరగక పోగా శరీరం లోని అన్ని అవయవాలు పొట్టతో అనుసంధానించాబడి ఉంటాయి కాబట్టి శరీరము చల్లబడిపోతుంది అయితే సహజంగా శరీరంలో వాతావరణానికి అనుగుణంగా ఏ వేడిమి కి అయినా అడ్జెస్ట్ చేసుకుంటూ ఎదుర్కునే వ్యవస్థ ఉంది శరీరం చల్ల బడి పోకూడదు ఒక్కో సారి శరీరం చల్లబడిందా మళ్ళీ వేడిని పుట్టించాలి.

కృత్రిమంగా మళ్ళీ వేడి పుట్టించాలి. చల్లటి నీళ్ళు త్రాగడం వల్ల శరీరం లో శరీరంలో మార్పులు ఏవిధంగా ఉంటాయి అంటే చల్లటి నీరు తాగిన తరువాత కడుపు చల్లని నీటి వేడి చేయాలంటే ప్రయత్నం చేస్తుంది దీనికోసం అదనపు శక్తి కావాలి.అదనపు శక్తి దానికి రక్తం నుండి లభించాలి.అంటే శరీరం లోని మిగతా అవయవాల లోని రక్తం అంత పొట్టమీద కేంద్రీకరించ బడుతుంది అంటే కొద్ది సేపు ఆయా భాగాలలో రక్త సరఫరా తగ్గుతుంది.గుండె యొక్క రక్తం పొట్టను చేరితే అప్పుడు గుండె పరిస్థితి ఏమిటి?రక్త ప్రసారం మెదడుకు రక్తం అందక పోతే ఆక్సిజన్ అందక సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లటి నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే విరేచనం కాకపోగా మలబద్దకం వంటి సమస్యకు దారి తీస్తుంది.ఆతరువాత మల ద్వారం పూర్తిగా కుంచించుకు పోతుంది.అంతే కాక గ్యాస్టిక్, డయాబెటిస్, లివర్ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చల్లటి కూల్ వాటర్ తాగక పోవడం ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగడం ఐస్ క్రీం తినవద్దని అలాచేస్తే శరీరం సర్వనాశనం కావడం గ్యారంటీ.మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చల్లటి నీరు ఐస్ క్రీమ్ల జోలికి వెళ్ళకండి తీసుకునే ముందు దాని ప్రభావం ఏమిటో ఒక్కసారి గమనించండి.బీ హ్యాపీ బీ హేల్తీ.