నేడే కేబినెట్‌కు బిల్లు
posted on Dec 5, 2013 7:39AM
తెలంగాణ ఏర్పాటు విషయంలో జీవోయం తుది నివేదిక సిద్దం చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఆంటోని ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే తుది నివేదిక సిద్దమయ్యింది అన్న ఆయన ఈోజు నివేదికను ప్రదానికి అందజేస్తామన్నారు. అది కేభినెట్ ముదుకు ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని ప్రదానే నిర్ణయిస్తారన్నారు.
అయితే ఆయన తరువాత మాట్లాడిన షిండే మాత్రం బిల్లు గురువారం కేభినెట్ ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే జీవోయం నిర్ణయం ఏమిటి అన్న విషయం మాత్రం ఆయన ప్రకటించలేదు. పది జిల్లాల తెలంగాణనా, లేక 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనా అన్నవిషయం కేభినెట్ ముందుకు బిల్లు వచ్చిన తరువాత తెలుస్తుంది అన్నారు.