సీమాంద్రకు అదనపు బలగాలు
posted on Dec 5, 2013 7:29AM
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన తుది నివేదికను జీవోఎం సభ్యులు సిద్దం చేసిన నేపధ్యంలో పోలీస్ శాఖ సీమాంద్ర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ గట్టి బందోబస్తు చేపట్టింది. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నారు.
విభజన సెగలతో పాటు డిసెంబర్ 6 బ్లాక్ డే కూడా కావడంతో పరిస్థితి మరింత సున్నితంగా తయారయ్యింది.ఈ సందర్భంగా గతంలో ఎన్నాడు లేని విధంగా భద్రతా ఏర్పాట్లను చేసి అదనపు డీజీలతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.