తెలంగాణ బంద్...పలుచోట్ల ఉద్రిక్తత
posted on Dec 5, 2013 @ 10:46AM
రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ తెలంగాణ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఐదు గంటల నుంచి తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. జిల్లాలోని బస్సు డిపోల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.
#. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలోని జూబ్లీబస్టాండ్‌వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఈటెల హెచ్చరించారు.
#. తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు.
#. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు బైక్ ర్యాలీకి యత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
#. రాయల తెలంగాణకు ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ బంద్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. అసెంబ్లీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.