కాంగ్రెస్ తరఫున పోటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దరఖాస్తు
posted on Aug 22, 2023 @ 1:42PM
గత ఎన్నికల తరువాత ఆపరేషన్ ఆకర్ష్ పేర ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్ కు ఇప్పుడు ఈ ఏడాది చివరిలో జగనున్న ఎన్నికల సమయంలో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఎదురు కానున్నాయా? బీఆర్ఎస్ సిట్టింగులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారా? వారు జెండా మార్చేసేందుకు రెడీ అవుతున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. ఇక పార్టీలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సెగలను ఎదుర్కొనక తప్పదా? ఇప్పటికే కేసీఆర్ జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం (ఆగస్టు 21) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు.
రేఖానాయక్ పీఏ గాంధీ భవన్ కు వెళ్లి అక్కడ రేఖా నాయక్ దరఖాస్తును అందించారు. కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన గంటల వ్యవధిలో రేఖా నాయక్, ఆమె భర్త శ్యాం నాయక్ లు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇప్పుడు రేఖా నాయక్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి గాంధీ భవన్ లో దరఖాస్తు చేయగా, ఆమె భర్త శ్యాం నాయక్ కూడా ఆసీఫా బాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ఓ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు.