చీపురుపల్లిలో బొత్స ఓడిపోవడం ఖాయం
posted on May 15, 2014 @ 5:42PM
శుక్రవారం నాడు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఓట్ల కౌంటింగ్ జరగకముందే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఓడిపోతున్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే బొత్స హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స చీపురు ముక్కలు చెక్కలు అయిపోవడం ఖాయమనే ఫీలింగ్ రాజకీయ వర్గాల్లో కలిగింది. చాలా దీనంగా, కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిందన్నట్టు మాట్లాడిన బొత్సని చూస్తుంటే తన ఓటమి ఖాయమైపోయినట్టు బొత్స చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి, టోటల్ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కన్న ఆయన ఈరోజు రాష్ట్రంలో టీడీపీ గెలవాలని, టీడీపీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టంగా చెప్పాడంటే అంతకంటే ఓటమిని అంగీకరించడం మరొకటి వుంటుందా? మొత్తమ్మీద ఈ ఎన్నికలలో సీమాంధ్రలో మొట్టమొదటి ఓటమిని నమోదు చేసుకుంది బొత్స సత్యనారాయణే.