మన్మోహన్ అంటే రాహుల్ గాంధీకి చిన్నచూపు
posted on May 15, 2014 @ 5:33PM
ప్రధానిగా పదవీకాలం ముగిసిన ప్రధాని కాని ప్రధాని మన్మోహన్‌సింగ్ రెండుసార్లు దేశానికి ప్రధాని అయినప్పటికీ తన సొంతంగా ఒక్క నిర్ణయం తీసుకున్న పాపాన పోలేదు. సోనియా, రాహుల్ చెప్పినదానికల్లా తల ఊపడం మినహా ఆయన సాధించిందేమీ లేదు. ఇలా అన్నిటికీ తల ఊపే వ్యక్తి అంటే ఎవరికైనా చులకనభావం, చిన్నచూపు వుంటుంది. రాహుల్ గాంధీకి కూడా మన్మోహన్ అంటే అలాంటి చిన్నచూపేదో ఉన్నట్టుంది. అందుకే బుధవారం నాడు మన్మోహన్ ఢిల్లీలో వీడ్కోలు విందు ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వంలోని వారు, కాంగ్రెస్ పార్టీలోని అందరూ హాజరయ్యారు. యువరాజు రాహుల్ గాంధీ మాత్రం హాజరు కాలేదు. ఇలా రాహుల్ గాంధీ విందుకు హాజరు కాకపోవడం మన్మోహన్‌ని చిన్నచూపు చూసి అవమానించడమేనని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు. మన్మోహన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందు కేవలం మన్మోహన్ సింగ్‌కి మాత్రమే కాదని.. అది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా వర్తి్స్తుందని, ఇక వీరిద్దరూ అధికారానికి దూరంగా వుండక తప్పదని సంజయ్ అన్నారు.