సోనియాకు మద్దతుగా టీపీసీసీ సత్యాగ్రహ దీక్ష
posted on Jul 26, 2022 @ 11:55AM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ఈసీ విచారిస్తున్నది. ఆమె విచారణ నుంచి వచ్చే వరకూ ఆమెకు మద్దతుగా తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేప ట్టారు. దీక్షకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, పొన్నాల, మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రెడ్డి, బోసు రాజు తదితరులు హాజరయ్యారు.
విచారణ పేరుతో ప్రధాన ప్రతిపక్షాన్ని అవమానిస్తున్నారని, దేశంలోని కీలక పరిశోధనా సంస్థలను బిజెపీ ప్రభుత్వం స్వార్ధప్రయోజనానికి వాడుకుంటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు భారీ నినాదాలు చేస్తూ నిర సన తెలి పారు. చాలారోజులుగా కేంద్రం ప్రధాన పక్షం మీదా, బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికార పక్షాల మీద కక్షగట్టినట్టు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
దేశంలో అసలు ప్రతిపక్షం లేకుండా చూడాలని, తమ విధానాలు, కార్యక్రమాలను ప్రశ్నించేవారు, అడ్డు కునేవారూ లేకుండా చేసుకో వాలన్న దృష్టితోనే బీజేపీ సర్కారు ఇంత దారుణంగా వ్యవహరిస్తోం దన్నారు. అందుకు దేశంలో ప్రతిష్టా త్మక సిబిఐ, ఈడీలను ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిం చారు. కేంద్రం ఏది చెబితే అది చేయడానికి తందాన తానా అంటూ వ్యవహరిస్తున్న ఈ సంస్థలు రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.