మరాఠీలకు ప్రాంతీయవాదం అంటే మమకారం
posted on May 4, 2023 @ 12:11PM
జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల మహరాష్ట్ర ఔరంగా బాద్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రచారం కూడా భారీగానే కల్పించింది బీఆర్ఎస్. మరాఠా పత్రికలకు లక్షలాది రూపాయల యాడ్స్, జర్నలిస్ట్ లకు రాచమర్యాదలు చేసింది. ఈ వార్త సేకరించడానికి వచ్చే రిపోర్టర్లలో కొందరికి ఫ్లయిట్ ఖర్చులు కూడా బీఆర్ఎస్ భరించింది. వారికి రాచమర్యాదలు చేసింది. ఇటీవలె మహరాష్ట్రలో బోకర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికలో భారీ ఓటమిని చవి చూశారు. డైరెక్టర్ పదవులను ఆశించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదిలోనే భంగపడ్డారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. మొత్తం 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 13, బీజేపీ 3, ఎన్సీపీ 2 గెలుచుకుంది. ఈ ఓటమికి బలమైన కారణం ఒకటుంది. ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీభాయ్ పుట్టిన గడ్డ అది. వందల సంవత్సరాల నుంచి మరాఠీల రక్తం దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఉన్నట్లు రుజువయ్యింది. చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. హిందుత్వవాదంను సమర్ధించే పార్టీలు అక్కడ మనుగడ సాగిస్తాయని లోకోక్తి. శివసేన అయినా బీజేపీ అయినా అధికారాన్ని పంచుకున్నాయి. కానీ ప్రాంతీయేతర పార్టీలను మరాఠా గడ్డ మీద కాలు మోపనీయలేదు. మరాఠీలు మాత్రమే ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రేస్ పార్టీలో పదవులు అనుభవించిన శరద్ పవార్ మరాఠీయుడు. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మరాఠీయుడు. భోకర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడానికి అశోక్ చవాన్ ముఖ్య కారణం. మరాఠా గడ్డ మీద బీఆర్ఎస్ ఎంట్రీని అతను ఏ మాత్రం సహించలేకపోయారు. మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ఏమిటి? మరాఠీలు పునరాలించుకోవాలని అశోక్ చవాన్ స్థానికులను అనేక మీటింగ్స్ లో ప్రశ్నించారు. ఒక సారి బీఆర్ఎస్ ప్రవేశిస్తే మన ప్రాంతం ప్రమాదంలో పడినట్టేనని ప్రచారం చేశారు. ఈ మేరకు పావులు కూడా కదిపారు. ఒక్క వోటుకు 10 వేల రూపాయల పెట్టి కొనుగోలు చేసినట్టు బీఆర్ ఎస్ పై ఆరోపణ ఉంది.
భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భోకర్ లో ప్రాబల్యం ఉన్న నాగ్ నాథ్ ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. నాగ్ నాథ్ ను కేసీఆర్ ఓదార్చారు. వెంటనే మరాఠా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మొదటి ఓటమి విజయానికి తొలి మెట్టు కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు జిల్లా పరిషత్ , మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద పెద్ద కలలే కన్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీలను అధికారంలో తీసుకురావడానికి బీఆర్ఎస్ అధినేత కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా పర్యటించాలని, తాను ప్రధాని కావాలని ఉవ్వీళ్లూరారు. ఎవరూ ఊహించనీ విధంగా భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ తొలి సారి పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మహరాష్ట్రలోని బోకర్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భోకర్ తాలూకాలోని నంద, రాతి, కిని, పలాజ్ దివిసి గ్రామాలు నిర్మల్ తదితర జిల్లా సరిహద్దులను పంచుకుంటున్నాయి. భోకర్ భైంసా పట్టణానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాల్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఆవాసమున్నారు. సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. భోకర్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ ఓటమితో కలత చెందారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను మహరాష్ట్రలో అమలు చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికలో వర్కవుట్ కాలేదు.