బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు మృతి
posted on Nov 10, 2022 @ 4:29PM
తమిళనాడులోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మధురైూ సమీపంలోని తిరుమంగళంలో జరిగిన ఈ సంఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు.
మదురైలోని తిరుమంగళంలో ఓ క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమంగళా పురంలోని అగు జైలు గ్రామంలోని ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. దుర్ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో . 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంభవించిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, మాంసంముద్దలుగా మారిన శరీర భాగాలతో భీతావహంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.