రాజాసింగ్ ... బీజేపీ అర్ధరహిత రాజకీయ నాటకం
posted on Aug 30, 2022 @ 10:40AM
నాటకానికి మంచి నటులు కావాలి. అప్పుడే రక్తికడుతుంది. కానీ బీజేపీవారి నాటకానికి ప్రత్యేకించి నటు లను వెతుక్కోనవసరం లేదు. తెలంగాణాలో పార్టీ నిండా నటులేనన్న ఆరోపణలు బాగా వినపడుతున్నా యి. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీనుంచి సస్పెండ్ చేయడం పెద్ద డ్రామా అని తెలం గాణా రాజకీయాలను గమనిస్తున్న విశ్లేషకులే అంటు న్నారు. తాజాగా మజ్లీస్ అధినేత ఎంపీ అసదు ద్దీన్ ఒవైసీ అన్నారు. కర్ణాటకాలో గణేష్ చతుర్ధి సంద ర్భంగా మాంసాహారంపై నిషేధం విధించడ మేమి టని ఆయన మండిపడ్డారు.
బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా బీజేపీ ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని ఓవైసీ ప్రశ్నించారు. మాంసం అమ్మేవారిలో ఎక్కువ మంది ముస్లిం వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారన్న అక్కసుతోనే మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నారని ఒవైసీ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు స్టేషన్లకు వరుస ఫిర్యాదులు అందడంలో రాజాసింగ్‌ను షాహినాయత్ గంజ్ పోలీసు లు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సోషల్ మీడియాలో రాజా సింగ్ పెట్టిన వీడియోపై మజ్లిస్ ఆందోళనలు చేపట్టింది. మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసు స్టేషన్ల ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
రాష్ట్రంలో రెచ్చగొట్టే ధోరణితో బీజేపీ బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నదని టీఆర్ ఎస్ నేతలు కూడా ఆరో పిస్తున్నారు. రాజాసింగ్‌తో ఆ ప్రకటన చేయించి, ఆయనపై సస్పెన్షన్ వేటు డ్రామా నడ పడం ఎవ్వరికీ తెలియదనుకోవడమే బీజేపీ అవివేకమని టీఆర్ ఎస్ నేతల మాట. తెలంగాణ ప్రజలు వీటిని జాగ్రత్తగా గమనించాలని కోరారు. బీజేపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించి రాజకీయ ప్రయోజ నాలు పొందాలని చూస్తున్నదన్నారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టి ప్రతీకార దాడులు జరిపించుకోవాలని తీవ్రప్రయత్నం చేస్తున్నదన్నారు. కానీ, కేసీఆర్‌ది, టీఆర్ఎస్‌ది అలాంటి ఆలోచన లు కావని , టీ ఆర్ఎస్ క్యాడరే తిరగబడితే రాష్ట్రంలో బీజేపీ ఉంటుందా? అని టీఆర్ ఎస్ సీనియర్ నేతలు హెచ్చరి స్తు న్నారు.
అసలు మునావర్ హైదరాబాద్ షో గురించి ఎవ్వరికీ లేని అభ్యంతరాలు రాజాసింగ్‌కే రావడంతోనే ఘర్ష ణకు పరిస్థితులు దారితీశాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో భగ్గుమన్న ఎంఐఎం శ్రేణులు పాతబస్తీలో ఆందోళన చేపట్టాయి. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్ రాజాసింగ్ వీడియోను తొలగిం చింది.
ఇలాఉండగా, శాంతియుతంగా ఉండే తెలంగాణలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆయన పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని హోంమంత్రి మహమూద్ అలీ ఆగష్టు 29న ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. అందుకే ప్రముఖ బహుళజాతి కంపెనీలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయన్నది బీజేపీ గుర్తించాలని హోం మంత్రి అన్నారు.
బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం. సైబర్ నేరాల అదుపులో, నేరాల నమోదు, నేరస్తుల అరెస్టులు, డబ్బుల రికవరీ, శాంతిభద్రతల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర పోలీసులు ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని మొఘల్ సరాయిలో సైబర్ నేరస్తుల నుండి రూ.9 కోట్లను రికవరీ చేశారు. కానీ బీజేపీ వారికి ఇవేమీ కనపడవు, వినప డవు. కేవలం గోల చేసి లేని సమస్యల్ని సృష్టించి రాష్ట్రంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాలన్న ఆతృ తే బీజేపీ క్యాడర్ కనపరుస్తోంది. వారికి అరిచి గోలచేయడం మీదనే ఎక్కువ ఆసక్తి అనే విమర్శలు రాష్ట్ర మంతటా ఉన్నాయన్నది విమర్శకుల మాట.
తెలంగాణా బీజేపీ నేతలకు కేంద్రంలో ఉన్నవారిని ఎలాగయినా ఆకట్టుకోవాలన్న ఆతృత, కేంద్రంలో ఉన్న బీజేపీ సీనియర్లకు రాష్ట్రంలో ఉన్నవారిని ఉసిగొలిపి మరీ రాష్ట్రంలో గొడవలు, పార్టీల క్యాడర్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఉత్సాహపరచడం తప్ప వేరే కార్యక్రమం ఏమీ ఉండడం లేదన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గట్టిగా ఏ సమస్యా లేకున్నా మతపరమైన చిన్న అంశం అడ్డుపెట్టుకుని మరీ రెచ్చిపోయి దూకుడుగా వ్యవహరించడం బీజేపీ నేతలు బాగా అలవర్చుకున్నారు. అటు ఆంధ్రాలో కూడా తాజాగా గణేష్ మండపాల విషయంలో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. విగ్రహాలు, మండపాల విషయంలో అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత యాజమాన్యాలకు తగిన సూచనలు చేసింది. అయినా వాటికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేయాలన్న పట్టుదల అర్ధంలేని దని వైసీపీ, కాంగ్రెస్ కూడా మండిపడుతున్నాయి.