ఎట్టకేలకు ప్రసూతి బిల్లుకు ఆమోదం..
posted on Aug 12, 2016 @ 12:07PM
ఎట్టకేలకు ప్రసూతి బిల్లుకు ఆమోదం లభించింది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించిన రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక లోక్ సభలో ఆమోదం పొందడం ఒక్కటే మిగిలింది. అయితే వచ్చే శీతాకాల సమావేశాల్లో లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఎలాగూ ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది కనుక లోక్ సభలో కూడా ఆమోదం పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బిల్లు వల్ల కలిగే లాభాలు
* ఇప్పటి వరకూ 12 వారాలు సెలవు పరిమితి ఉండగా..ఇప్పుడు అది 26 వరకూ పెరుగుతుంది
* ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలకూ ఈబిల్లు వర్తిస్తుంది.
* ఇంటి నుండి పనిచేసే మహిళలకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది.
* అయితే ఇద్దురూ లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు మాత్రం ఈ సెలవు దినాలు వర్తించవు.