ఓటింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్న బీజేపీ
posted on Oct 29, 2022 @ 2:14PM
ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. అవును రోజూ లెక్కలు చేస్తుంటే భయం పోతుందిరా.. అంటాడు తండ్రి కొడుకుతో...బాగా ప్రాక్టీస్ చేయి..సిక్స్ కొట్టడం తెలుస్తుందంటాడు ప్లేయర్ తో కోచ్.. ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటు వేయడం గురించి నేర్పుతారు అక్కడి వాలంటీర్లు. వేలి మీద వేసిన చుక్క ఎలా పోతుందనేది నాయనమ్మ చెబుతుంది.. చిత్రంగా మునుగోడులో జనానికి బీజేపీ వారు తమకే ఓటువేసే విధానాన్ని బోధిస్తున్నారు.
అసలు ఏదయినా ప్రజలు తమకు అనుకూలమయ్యే మార్గాన్ని ఆలోచించడంలో బీజేపీ వారిని మించి ఎవ్వరూ ఉండరు. వారి తెలివే తెలివి. ఉపన్యాసాలతో ఆకట్టుకుంటారు, ఎవరయినా సరే తమవారిని చేసుకోవడం వారి పనులు కానిచ్చేసుకోవడంలో ఉండాల్సిన తెలివి కమలనాథులకే తగును. ఎంత ఆలోచించినా వారితో పోటీ పడటం చాలా కష్టం. ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ వారికి, టీ ఆర్ఎస్ వారికి రాని ఆలోచనని బీజేపీవారికి రావడం వెంటనే అమలుచేసేయడం క్షణాల్లో జరిగిపోతోంది. ఇపుడు ఇంటిం టికీ తిరిగి మాకు ఓటెయ్యండి అంటూ బతిమిలాడుకోవడం, నోటు ఇవ్వడమే కాదు.. వాటికన్నా అసలు పోలింగ్ బూత్ కి వెళ్లాక పెద్దాయనో, పెద్దమ్మో ఏ కీ నొక్కితే భీజేపీ కి ఓటు వెళుతుందో కూడా వారికి తెలి సేలా చేస్తున్నారు. వారికి మెల్లగా ప్రాక్టీస్ చేయించితే ఓటింగ్ రోజు ప్రత్యేకించి ఆ బోర్డు మీద మీట నొక్కడం గురించి తెలియజేయక్కర్లేదు.
ఎందుకంటే, పాపం ఓటర్లకీ అందరికీ ఓటు వేయడంలో ప్రాక్టీస్ ఉండాలిగదా.. ప్రాక్టీస్ చేయిస్తే ధైర్యంగా వెల్లి మీట నొక్కి నవ్వుతూ బయటికి వస్తాడు.. బీజేపీ వారి మనుషులంతా కమలమంత పెద్దగా నవ్వులు విరజిమ్ముతారు. అదిగదా ఆనందం. అదే కావాలి. అందుకే మునుగోడు మొత్తాన్ని బీజేపీ గుర్తు ఓటింగ్ మిషన్ మీద ఎక్కడుంటుంది, మీట ఎలా నొక్కాలి.. ఈ ఘనకార్యం చేస్తే మనసు ఎంతగా నెమ్మదిస్తుం దీ, అంతా ఎంత ఆనందంగా ఉంటారు, అక్కర్లేకున్న రిక్షాలోనో, ఆటోలోనో ఇంటికి వెళ్లే మార్గం గురించి పెద్దగా ఆలోచించకుండానే జరిగిపోవడం...అన్నీ అయిపోతాయి. పాపం ఓటరుకి అంతకంటే ఏం కావాలి. ఎలాగూ డబ్బుల పంపకాలు, హామీలూ అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు పోలింగ్ స్టేషన్ కి ఎలా వెళ్లాలి, ఓటు ఎలా వేయాలన్నది మాత్రం నేర్పుకోలేదు. అది బీజేపీవారే బాగా ముందుగా గుర్తించి మరీ వెంటాడి నేర్పుతున్నారు.
నేర్పితేనే గొప్ప విద్య అవుతుంది. నేర్పితేనే మాట వింటారు. నేర్పితేనే పార్టీ గెలుస్తుంది. నేర్పితేనే మన వెంట ఉంటారు... ఈ నినాదాలన్నీ ఎంతగా ఉపకరిస్తాయన్నది కూలంకషంగా ఆలోచించే ప్రయోగా త్మకంగా మునుగోడులో, ఆనక పెద్ద ఎన్నికల్లో మరింత పకడ్బందీగానూ చేయిపట్టి చేయించే యొచ్చ న్నది కమలనాధుల ధీమా.. కాదు వాల్లు తప్పకుండా మన మాట వింటారని, మన గుర్తున్న మీటనే నొక్కుతారని కాషాయమంత వెలవని నమ్మకం.