బిల్లు రాజ్యాంగ విరుద్దం: నోటీసు ఇచ్చిన బీజేపీ
posted on Feb 20, 2014 @ 2:46PM
రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేఖంగా ఉంది గనుక దానిని తాము వ్యతిరేఖిస్తున్నట్లు ఉపసభాపతి కురియన్ కి నోటీసు ఇచ్చారు. ఆయనతో బాటు సుజన చౌదరీ, రాజీవ్ చంద్ర శేఖర్, నరేంద్ర గుజ్రాల్ తదితరులు కూడా బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. సభలో సీమాంధ్ర మరియు తమిళనాడుకు చెందిన సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఆందోళన చేస్తుండటంతో సభ పావుగంట సేపు వాయిదాపడింది.
పార్లమెంటు బయట బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ “మేము బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభను, మీడియాను తప్పు దోవ పట్టిస్తోంది. కానీ అది నిజం కాదు. బిల్లులో మేము సూచించిన సవరణలను చేర్చకుండా సభలో ప్రవేశపెట్టడంతో మా సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యంగా విరుద్దంగా ఉందని, దానిపై చర్చ కోరుతూ నోటీసు ఇచ్చారు తప్ప బిల్లుని వ్యతిరేఖించలేదు. మేము తెలంగాణా ఏర్పటుకు కట్టుబడి ఉన్నాము. కానీ, అదే సమయంలో సీమాంధ్రకు నష్టం కలగకూడదని కోరుకొంటున్నాము,” అని తెలిపారు.
లోక్ సభలో బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చిన బీజేపీ అదే బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేఖించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నపటికీ దానికి ప్రధాన కారణం ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్రలో ఎగసిపడిన వ్యతిరేఖతే కాకుండా, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ సూచించిన సవరణలను బిల్లులో ప్రవేశపెడితే, బిల్లుని తిరిగి లోక్ సభకు పంపవలసి ఉంటుంది గనుక, కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బిల్లుని యధాతధంగా ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును. సీమాంధ్రలో వ్యతిరేఖతను చూసి బిల్లు విషయంలో నాటకాలు ఆడుతున్న బీజేపీ, సభలో ప్రధానమంత్రి ప్రసంగం తరువాత బిల్లుకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
నాలుగు గంటలకి తిరిగి సమావేశమయిన సభ సభ్యుల అందోళనల కారణంగా మళ్ళీ వాయిదా పడింది.