బీహార్ ఎన్నికలలో హోరాహోరీ.. ముందంజలో కాంగ్రెస్ ఆర్జేడీ మహాఘట్ బంధన్
posted on Nov 10, 2020 8:55AM
భారత దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తరువాత ఈవీఎంలను తెరిచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, మొత్తం 243 స్థానాలు ఉండగా.. ఎన్డీయే 94 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహా ఘటబంధన్ 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఈ ఎన్నికలలో ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ), బీజేపీ కలిసి ఒక కూటమిగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ - కాంగ్రెస్ మరో కూటమిగా.. చిరాగ్ పాశ్వాన్ విడిగా ఎన్నికల్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, అయితే ప్రజలలో కొంత మొగ్గు మహా ఘటబంధన్ వైపే ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. తాజాగా తొలిగా వస్తున్న ట్రెండ్స్ కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు సీఎం గా చేసి ఇవే నా చివరి ఎన్నికలు అంటున్న ప్రస్తుత ముఖ్య మంత్రి నితీష్ కుమార్ భవితవ్యం ఈ ఎన్నికలలో తేలనుంది.