ఉత్తరాంద్రలో చంద్రబాబు
posted on May 17, 2023 7:50AM
వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమదైన శైలిలో పోరాడుతోంది. ఆ క్రమంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలో తాజాగా అంటే బుధవారం (మే 17) నుంచి శుక్రవారం (మే19) వరకు చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం పెందుర్తి.. గురువారం శృంగవరపు కోట.. శుక్రవారం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
అందుకోసం చంద్రబాబు నాయుడు బుధవారం (మే17) మద్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి సాయంత్రం పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణానికి చేరుకొని పంచ గ్రామాల సమస్యపై వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డ్ షో ప్రారంభమవుతోంది... ఆ క్రమంలో పెందుర్తి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక గురువారం (మే 18) ఉదయం టిడ్కో ఇళ్ల లబ్దిదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించి... ఆ తర్వాత స్థానిక నేతలతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం మత్స్యకారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శృంగవరపు కోటకు చంద్రబాబు పయనమై.. అక్కడ రోడ్డు షో నిర్వహించి స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అలాగే శుక్రవారం (మే 19) అనకాపల్లిలో నల్లబెల్లం రైతుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు. అనంతంర రోడ్ షో నిర్వహించిన ఆ తర్వాత స్థానిక నెహ్రూ చౌక్‌కు చేరుకొని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకుంటారు.