బాబు దెబ్బకు దిగొచ్చిన జగన్
posted on May 8, 2023 @ 5:40PM
నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అన్నీ తెలిసినట్లు ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గత నాలుగేళ్లుగా రాజధాని మార్పు, కోర్టు కేసులు, అప్పుల కోసం ఎదురు చూపులతో గడిపేశారు. తీరా స్పందించాల్సిన సమయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. ిటీవల రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటున్నారు.
రైతులకుఅండగా నిలబడేందుకు రాజమండ్రిలో మకాం వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం యిచ్చారు. అప్పటి లోగా రైతుల కష్టార్జితాన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తొలుత పట్టించుకోనట్లు వ్యవహరించిన అధికారులు రైతుల నుండి వస్తున్న ప్రతి స్పందనతో కదలాల్సి వచ్చింది. వెంటనే ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు తరలించే పని మొదలైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న రైతులు అండగా నిలబడిన చంద్రబాబుకు కృతజ్ణతలు తెలపారు.
కష్టంలో ఉన్న రైతాంగం కోసం జిల్లాలో బస చేసి ప్రభుత్వం మెడలు వంచిన చంద్రబాబు అక్కడి తెలుగుదేశం నేతలలో కొత్త ఆశలు నింపారు. యింత కాలం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకున్న వైసీపీ నేతలకు రైతుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం రావడం లేదు. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీసుకున్నసాహసోపేత నిర్ణయం రైతు లోకాన్ని ఆకట్టుకుంది. 72 గంటల లోగా ధాన్యంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ధాన్యం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ ముంగిట కుప్పలుగా పోస్తామని చంద్రబాబు చేసిన హెచ్చరిక రైతులలో ఆయన గౌరవాన్ని పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
రైతుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశంప్రతిష్ట మరింత పెరిగింది. యింత వరకూ హైకెట్ బాబు అంటూ, వ్యవసాయం దండగ అన్నారంటూ లేనిపోని ఆరోపణలు చేసిన వైసీపీ నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే గ్రామీణ పరిశ్రమలపై దృష్టి పెడతామని చంద్రబాబు ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 36శాతం వ్యవసాయ రంగం ఆక్రమించింది. కాగా పరశ్రమలశాతం 23శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్ వేల్యూ 41శాతంగాఉంది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు.
ఆయన మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు పెద్ద పీట వేస్తారని రైతులు ఆశిస్తున్నారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే బాబు పాలన రావాలని రైతులు అంటున్నారు.