అథ్లెట్లకు ప్రయాణ అసౌకర్యం.. ఆగ్రహించిన భండారీ
posted on Jul 29, 2022 @ 3:47PM
కామన్‌వెల్త్‌గేమ్స్ విలేజ్ నుంచి అలెగ్జాండర్ స్టేడియానికి టాక్సీలో కేవలం 30నిమిషాల ప్రయాణం. ఒలింపిక్ రజత పతకం సాధించిన భారత్ బాక్సర్ లవ్లీనా, ఆమె సహ ప్లేయర్ ముహమ్మద్ హుస్సీముద్దీన్ తమ ప్రాక్టీస్ స్టేడియాకి వెళ్లాలని అనుకున్నారు. వాళ్ల మ్యాచ్ కి సమయం ఉండటంతో ప్రాక్టీస్ చేయడానికి వెళ్లాలనుకున్నారు. అందువల్ల గేమ్స్ ప్రారంభోత్సవ ఉత్సవానికి మధ్యలోనే బయలు దేరారు. కానీ ఒక్క టాక్సీకూడా దొరకలేదు. వాళ్లకు బస ఏర్పాటు చేసిన స్టేడియాకు వెళ్లడానికి ఏ ఒక్క ఆటో కూడా దొరక్క పోవడంతో సుమారు రెండు గంటలపాటు గేమ్స్ ప్రారంభోత్సవ విలేజ్ వద్దనే వేచి ఉండా ల్సి వచ్చింది.
కాగా తెల్లవారుతుండగా మొదటి బస్సుపట్టుకుని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ నుంచి బయలు దేరారు. వాస్తవానికి భారత్ బృందానికి మూడు కార్లను నిర్వాహకులు ఏర్పాటుచేశారు. అథ్లెట్లు, సంబం ధిత బృం దాల అధికారులు గేమ్స్ విలేజ్‌కి సరయిన సమయంలో చేరేందుకు వీలుగా ఆ కార్లు, డ్రైవర్ల నూ ఏర్పాటు చేశారు. కానీ డ్రైవర్లు ఆ రాత్రిబాగా అలసిపోవడంలో ప్రారంభోత్సవానికి మన బృందం బస్సుల్లో వెళ్లవలసి వచ్చింది. ఈ విషయం తెలిసి భారత బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, భారత్ కామెన్ వెల్త్ గేమ్స్ బృందానికి ఛీఫ్ కూడా అయిన రాజేష్ భండారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం జరుగుతుండగా మధ్యలోనే లవ్లీనా, మరో బాక్సర్ ముందుగానే ప్రాక్టీస్ కోసం వెళ్లారని, అలాంటపుడు వారు అసలు ప్రారంభోత్సవానికి రాకుండా ఉండాల్సిందని, తమకు కూడా తగిన వాహనా లు ఏర్పాటు జరగక పోవడంపట్లా అయన ఆగ్రహించారు. వాస్తవానికి చాలామంది అథ్లెట్లు శిక్షణ కారణంగా ప్రారంభోత్సవానికి రావాలని అనుకోలేదని, దీన్ని గురించి బాక్సింగ్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతా నని భండారీ అన్నారు. ప్రారంభోత్సవ వేడుకలో మొత్తం 164మంది అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు.