అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం రెడీ
posted on Dec 24, 2013 @ 6:12PM
ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేసిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా డిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పట్టబోతున్నారు. ఆయన తన మంత్రి వర్గం సభ్యుల పేర్లను ఈరోజు ఖరారు చేసారు. మనిష్ సిసోడియా, రాఖి బిర్లా, సోమనాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీ మరియు సతేంద్ర సోనీ మంత్రులుగా ప్రమాణ స్వీఎకారం చేయనున్నారు. వీరిలో ఎవరికీ కూడా రాజకీయ నేపధ్యం కానీ అనుభవము కానీ లేదు. అయితే అందరూ ప్రస్తుత వ్యవస్థలో లోపాలను సరిద్దాలనే పట్టుదలతో చేస్తున్న ఉద్యోగాలను, వృత్తులను వదులుకొని రాజకీయాలలోకి వచ్చారు. వీరిలో ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పట్ట నున్న అరవింద్ కేజ్రేవాల్ అందరి కంటే ఉన్నత విద్యావంతుడు . ఆయన ఖరగ్ పూర్ ఐఐటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసారు. ఆదాయపన్నుల శాఖలో జాయింట్ కమీషనర్ గా పనిచేసిన ఆయన రాజకీయాలలోకి వచ్చేందుకు తన ఉన్నతోద్యోగాన్నివదులుకొన్నారు. 2006లో ప్రతిష్టాత్మకమయిన రామన్ మెగసెసే అవార్డును అందుకొన్నారు.