మంత్రి శ్రీదర్‌బాబకు కోర్టు సమన్లు
posted on Dec 25, 2013 6:38AM
మంత్రి శ్రీదర్‌బాబుపై కరపత్రాలను పంచిన శ్రీరామ్ అరెస్ట్ కేసులో మంత్రి కి నోటిసులు అందాయి. మంత్రితో పాటు హొం శాఖ కార్యదర్శి, డీజిపి, కరీంనగర్ జిల్లా ఎస్‌పి, గోవావరి ఖని పోలీసులకూ నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరామ్ భార్య స్వరూప చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాల ఉన్నందున కోర్టు ప్రాధమిక విచారణకు స్వీకరించింది.
అయితే కేవలం కరపత్రాలను పంచిన కేసులో ముద్దాయిని కాళ్లకు చేతులకు సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం, విచారణ పేరుతో కొట్టడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కరపత్రాలు పంచినట్టుగా ప్రాధమిక ఆదారాలు ఉన్నందున కేసు విచారణకు స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించిన కోర్టు శ్రీరామ్‌ను చంచల్‌గూడ జైళుకు తరలించాల్సిందిగా ఆదేశించింది.