టీచర్ పై.. కరస్పాండెంట్..
posted on Mar 16, 2021 @ 2:54PM
విద్యాలయాలు దేవాలయాలు అంటారు కానీ.. ఇప్పుడు వేదింపులకు నిలయాలుగా మారుతున్నాయి.. వేదాల్లో దుశ్యాసనుడు, ఇంద్రుడు, రావణుడు ఉన్నట్లుగా ప్రస్తుత సమాజంలో అలాంటి వాళ్ళు లేకపోలేదు.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వక్ర బుద్దులకు పాల్పడుతున్నారు.. తోటి ఉపాద్యాలు అని చూడకుండా ప్రవర్తిస్తున్నారు. స్కూల్ పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై ఓ కరస్పాండెంట్ కన్నేశాడు.. వేధిస్తున్నాడు..
గుంటూరు జిల్లా కారంపూడిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను వేదిస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆర్. జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత 12 సంవత్సరాలుగా ఉపాయధ్యాయురాలు జయలక్ష్మి ఇదే పాఠశాలలో పనిచేస్తుంది. అయితే స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకం చేపించుకొని వేదిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది . కరస్పాండెంట్‌కు మద్దతుగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు శేర్పనీ కూడా తనని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో చెప్పారు.
ఇక, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో ప్రాముఖ్యత గల పాఠశాల. కరస్పాండెంట్ అంటోనీ బాల పాఠశాలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతోమంది మహిళలు ఉపాధ్యాయులపై వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. కొంతమంది చెప్పుకోలేక పాఠశాలలో పనిచేయలేక బయటకి వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి కీచక కరస్పాండెంట్ వలన విద్యాసంస్థలకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.