ఏపీ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు ఐదు కీలక బిల్లులను తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రవేశ పెట్టనుంది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రులు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. ఆ తరువాత సభలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. అనంతరం సభలో ఐదు కీలక బిల్లలను ప్రవేశ పెట్టనుంది. అవి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు,  ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల బిల్లు, అలాగే ఎన్టీఆర్ హెల్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు.

అంతే కాకుండా గురువారం (నవంబర్ 14) మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక లాంఛనమే కానుంది.  రఘురామకృష్ణం రాజును డిప్యూటీ స్పీకర్ గా  స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలపై మంత్రులు సభలో ప్రకటన చేయనున్నారు. వీటిలో ఏపీ ఎమ్ఎస్ఎమ్ఇ అభివృద్ధి పాలసీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలెప్ మెంట్ పాలసీ,  ఆంధ్ ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.పై   మంత్రి టీజీ భరత్ స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు.