15 నుంచే ఏపీ అసెంబ్లీ...మూడు రాజధానుల బిల్లు
posted on Sep 14, 2022 @ 5:33PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ ఉద యం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఈ సమావేశాల్లోనే మూడు రాజ ధానులపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని అధికార పక్షం భావిస్తోంది. పోలవరం పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించి నట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభు త్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైసీపీ భావిస్తోంది.
సభ మొదటి రోజే మూడు రాజధానుల అంశంపై లఘు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై సీఎం జగన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాన్ని.. ప్రజల్లోకి సమగ్రంగా తీసుకెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సమావే శాల్లో కీలక అంశాలపై చర్చ ప్రారంభించడంతోపాటు టీడీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నిర్ణయిం చింది. మూడు రాజధానుల బిల్లు చర్చ వంటి అంశాలను సీఎం జగన్ నిర్ణయానికి వదిలివేశారు.
బీఏసీ సమావేశంలో తెలుగుదేశం ప్రతిపాదించే అంశాలపై చర్చ చేపట్టి.. ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేయా లని వ్యూహా కమిటీ సమావేశంలో పలువురు నేతలు సూచించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు అధి కార వైసీపీ సన్నద్ధమైంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం, టీడీపీని డిఫెన్స్‌లో పడేసే విధం గా చర్చ చేపట్టాలని అధికారపార్టీ నిర్ణయించింది. సమావేశాలు ఐదు రోజులపాటు నిర్వహించాలని తాత్కాలి కంగా నిర్ణయించారు. బిఏసీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.