ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉండే  బీజేపీ నాయకుడు, గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై  వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళ్ హట్​ పోలీస్ స్టేషన్​లో  రాజాసింగ్  తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఇదే మంగళ్ హాట్ పీఎస్ లో  ఆదివానం ( ఏప్రిల్ 6)న కేసు నమోదైన సంగతి తెలిసిందే. ముందుగా ఆదివారం నాడు రాజాసింగ్ పై శోభాయాత్ర సందర్భంగా పోలీసు ఆదేశాలను ధిక్కరించి డీజే ఏర్పాటు చేయడంతో రాజాసింగ్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ తో పాటుగా  శ్రీరామనవమి పల్లకి సేవా శోభాయాత్ర నిర్వాహకుడు ఆనంద్​సింగ్ లోథ్,  భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భవంత్​రావులపై  బీఎన్ఎస్ సెక్షన్లు 223, 292 కింద కేసు నమోదు చేశారు.

ఇప్పుడు తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) అదే శోభాయాత్రలో అనుచిత భాష ప్రయోగించారంటూ మరో కేసు నమోదైంది. శోభాయాత్ర సందర్భంగా ధూల్ పేట జాలి హనుమాన్ దేవాలయం వద్ద పోలీసులు, శోభాయాత్రలో పాల్గొన్న వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు  చేశారంటూ రాజాసింగ్ పై పోలీసలుు  కేసు నమోదు చేశారు.   

Teluguone gnews banner