విడదల రజినికి జెయిలా? బెయిలా?

కోర్టు నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ

సైబరాబాద్ మొక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.   అక్రమ వసూళ్ల కోసం,తన పై  బెదిరింపులకు పాల్పడ్డారని  స్టోన్ క్రషర్  యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో, విడుదల రజిని ని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ప్రచారమే కాదు స్వయంగా రజనీ కూడా తనను అరెస్టు చేస్తారన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో ఆమె  హైకోర్టులో  ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు  తీర్పు  రిజర్వ్  చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడదల రజినికి ముందస్తు బెయిలు లభిస్తుందా? లేదా అన్న ఆసక్తి నెలకొంది.   క్రషర్ వ్యాపారిని బెదిరించిన కేసులో విడుదల రజిని భవితవ్యం ఏంటి ? ఈ కేసులో కోర్టు మాజీ మంత్రి విడదల రజనీకి  ముందస్తు బెయిల్ ఇస్తుందా, తిరస్కరిస్తుందా? అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో  యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రజిని  ఈ వివాదంతో తనకే మాత్రం సంబంధం లేదనీ,   రాజకీయ కుట్ర తొనే తనపై ఆరోపణలు చేశారనీ, ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.  అయితే 2019 - 24 మధ్య కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని అనుచరులపై ,ఆమె వ్యక్తిగత సిబ్బంది పై , అనేక ఆరోపణలు  వచ్చాయి. వాటిపై అప్పట్లోనే కొన్ని కేసులు నమోదవగా మరికొన్ని ఫిర్యాదుల వరకూ వెళ్లాయి. ప్రస్తుతం ఆ ఫిర్యాదులన్నీ కేసులుగా మారతాయన్న  ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  స్టోన్ క్రషర్ యజమాని వద్ద రెండు కోట్లు లంచం తీసుకున్నారనీ, దీనికి ఐపీఎస్ అధికారి జాషువా ,  విడదల రజిని వ్యక్తిగత సిబ్బంది  స్టోన్ క్రషర్ యజమానిని బెదిచారనీ ఆరోపణలు ఉన్నాయి.

 ఆ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.   ఈ కేసులో  మాజీ మంత్రి విడదల రజినికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ ఏసీబీ తరఫున న్యాయవాదులు హైకోర్టు ముందు గట్టిగా   వాదనలు వినిపించారు.   ఈ నేపథ్యంలో విడుదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత  ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొన్నది.   కేసు ఒక్క ముడుపుల విషయంలోనే అయితే ముందస్తు బెయిలు రావడం కష్టమేమీ కాదనీ, అయితే.. స్టోన్ క్రషర్ యజమానికి చంపేస్తామని బెదరించారని కూడా కేసు ఉండటంతో ముందస్తు బెయిలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా కేసు రుజువైతే మాజీ మంత్రి విడదల రజినికి పదేళ్ల జైలు విక్ష పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో రజినికి బెయిలా? అరెస్టా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

Teluguone gnews banner