లోకీ.. పప్పీ కాదు.. బ్యాట్‌మెన్ ని!
posted on Oct 13, 2022 @ 11:35AM
ఆ మధ్య చింటూ ఎదురు ఫ్లాట్‌లో తన స్నేహితుడి దగ్గరికి వెళ్లాడు. తలుపు తీయగానే హాల్లో సోఫా దగ్గర బ్యాట్‌మెన్ డ్రస్‌లో ఏదో కనిపించగానే భయ పడి ఆగిపోయాడు. రవి వచ్చి.. అదే మా కుక్కపిల్లరా .. భయపడకు.. రా అంటూ లోపలికి తీసికెళ్లా డు. భయం భయంగానే దాని దగ్గరికి వెళ్లి దాన్ని తలమీద చేత్తో తట్టాడు. అప్పటికి గాని ధైర్యం రాలేదు! అవును టామీయే!.. బ్యాట్‌మెన్ ఎలా అయింది?!
పిల్లులు, కుక్కపిల్లల పెంపకంపట్ల అమితంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో పిల్లలు అడుగుతున్నా రనీ ఓ కుక్కపిల్లనో, పిల్లినీ తెచ్చి పెంచుకోవడం సరదా అయిపోయింది. వాటిని పొద్దుటో, సాయింత్రమో తమతో పాటు వాకింగ్‌కి తీసికెళ్లడాలూ కూడా! పైపెచ్చు చక్కగా డ్రసింగ్ కూడా ఈమధ్య మొదలయింది. అన్నింటికీ మించి జంతువులతో వస్తున్న టీవీ సిరీస్‌లో వాటికి ఉండే డ్రస్‌లు వెయ డానికి ప్రయత్నిస్తు న్నారు. వాటిని కూడా అలా చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగమే బాట్ మెన్ డ్రస్‌తో కుక్క పిల్లను తయారుచేయడం!
సరదాకి అంతే లేదు.. బ్యాట్‌మన్ డ్రస్, షూలు కూడా తొడిగి అచ్చం అలానే ఉండేట్టు తయారుచేస్తు న్నారు. ఆ బ్యాట్‌మన్ గాల్లో ఎగిరి నానా భీభత్సం సృష్టించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఈ కుక్క, కుక్కపిల్లా ఆ డ్రస్ వేసుకుని మహా ఇబ్బంది పడుతోంది. కారణం వాటికి ఇలాంటి డ్రస్‌లు గట్రా ఎలా నప్పుతాయి. తోకవూపుతో అలా ఇంట్లోనో, వీధిలోనో, తోటలోనో తిరగడం అలవాటుగదా! అమెరికాలో ఓ నగరంలో ఓ కుటుంబం తమ కుక్కపిల్ల లోకీ ని అలా డ్రస్ చేసి వీడియోలు తీశారు. దాని విన్యా సాలు చూసిన నెట్‌జన్ సంఖ్య లక్షల్లో ఉంది!