ఆగు.. తిననీ!
posted on Oct 13, 2022 @ 11:07AM
స్కూలు, కాలేజీ విద్యార్ధులకు చిరుతిండిగా మారింది పానీపూరీ. ఇపుడు దాదాపు అన్ని పట్టణాల్లో ఇది యువతకు సాయంత్రాలు సరదాగా తినడానికి ఆసక్తికరంగా మారింది. ఏకంగా దుకాణాలూ వెలిశాయి. అస్సాం తేజ్‌పూర్‌లో ఏకంగా ఏనుగు కూడా ఇష్టంగా తిన్నది.
చాలా ప్రాంతాల్లో ఈ దుకాణాలు మీటింగ్ ప్లేస్‌గానూ మారింది. సరదా కబుర్లకు ప్రత్యేకించి హోటళ్లకే వెళ్ల క్కర్లే కుండా తయారయింది. తింటూ కబుర్లాడుకోవడం కుర్రాళ్లకు సరదాగా మారింది. వేడి వేడిగా తినే చిరు తిళ్ల కంటే చల్లచల్లగాకుండలోంచి పానీపూరీని నింపి ఇవ్వడం క్షణాల్లో గుటుక్కున మింగడం .. తిన డంలో తమషా! అన్నట్టు చాలాప్రాంతాల్లో పోటీలు కూడా పెట్టుకుంటున్నారట!
కాస్తంత ఎండవేళకి రోడ్డుమీద అలా వెళుతూంటే హఠాత్తుగా కొందరు పానీపూరీ తింటూ ఏనుగు మావటికి కనపడ్డారు. కాస్తంత సేదతీరినట్టుంటుందని అక్కడికి వెళ్లాడు. ఓ రెండు తిన్నాక వెనకే ఉన్న ఏనుగు తొండంతో చేయి లాగడం ఆరంభించింది. ఆగమ్మా..వెళదాం..అసలే కాళ్ల నొప్పులు, పైపెచ్చు దాహంతో కూడిన ఆకలి.. తిననీ అన్నాడు మావటి. అబ్బే వినలేదు, ఇంకా లాగింది. అతనికి అప్పటికిగాని అర్ధం కాలేదు.. గజరాజుకి కూడా ఈ టేస్ట్ చూడాలనుందని. అంతే ఒకటి అందించాడు. క్షణంలో మళ్లీ తొండం చాపింది. మరోటి.. మరోటి.. ఓ నాలుగు అయ్యాక ఇక లాభం లేదని మావటి ఏనుగుని లాక్కెళ్లాడు. ఏ ముప్ప య్యో.. బండంతానో తింటే!.. డబ్బులెవరిస్తారు.. దాని పాటికి అది నిమ్మళంగా నడిచి వెళుతుం ది.. దుకాణం వాడు మావటి పీకేగా పట్టుకునేది.. అందుకని గజరాజుగార్ని మావటి అతి కష్టంమీద లాక్కెళ్లిపోయాడు.