భారత్ జోడో యాత్ర.. ఆల్ వుమెన్ వాక్
posted on Jan 9, 2023 @ 10:42AM
కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సోమవారం (జనవరి 9) అందరూ మహిళలే పాల్గొననున్నారు. ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం (జనవరి 9) సాగుతున్నఈ యాత్రలో అందరూ వహిళలేప పాల్గొననున్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో రాహుల్ జోడో యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే యాత్రలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్నలక్ష్యంతో ఆల్ వుమెన్ వాక్ చాప్టర్ ప్రారంభించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. గత ఏడాది నవంబర్ 19న ఇందిరాగాంధీజయంతి సందర్బంగా కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కేవలం మహిళలు మాత్రమే నడిచిన సంగతి విదితమే.
అలాగే గత ఏడాది డిసెంబర్ లో మహిళా శశక్తిదివస్ సందర్బంగా కూడ రాహుల్ లో కలిసి యాత్రలో కేవలం మాత్రమేపాల్గొన్నారు. ఇలా ఉండగా గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ జోడో యాత్ర ఈ నెల 30న శ్రీనగర్ లో ముగియ నుంది.