ప్రపంచంలోనే తొలి రోబో టీచర్.. ఏఐ నిపుణుల అద్భుత సృష్టి
posted on Aug 10, 2023 @ 4:23PM
ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్ బెంగళూరు, హైదరాబాద్ లలో ఇండస్ స్కూల్స్ లోపాఠాలు మొదలు పెట్టేసింది. 5 అడుగుల 7 అంగులాల ఎత్తు ఉన్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ పాఠాలను సమర్ధవంతంగా చెబుతుంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో టీచర్ ప్రపంచంలోనే తొలి సారిగా ప్రవేశపెట్టిన ఇండస్ స్కూల్స్ యాజమాన్యం.. బోధనలో కచ్చితత్వం, వంద శాతం ఫౌల్ ప్రూఫ్ అని చెబుతోంది. ఈ రోబో టీచర్ ను ఏఐ నిపుణులు రావు, రాహు లు సంయుక్తంగా రూపొందించారు. ఇరువురూ బెంగళూరుకు చెందిన వారే. కాగా ఈ రోబో టీచర్ బోధన పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోబో టీచర్ పాఠాలను బహు చక్కగా, అర్ధమయ్యేలా చెబుతోందని అంటున్నారు.
తమ సందేహాలను కమాండ్ ద్వారా అడిగి రోబో టీచర్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవడంతో చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా అర్ధవంతంగా చదువు సాగుతోందని అంటున్నారు. ఈ రోబో టీచర్ల వల్ల భవిష్యత్ లో టీచర్ రిక్రూట్ మెంట్ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో టీచర్ల సెలవులు, ట్రాన్స్ ఫర్లు అంటూ బోధనకు అవరోధాలు, ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉండవని అంటున్నారు.