జగన్ సభలకు పిల్లల తరలింపు.. కోర్టులో జడ శ్రవణ్ కుమార్ పిటిషన్
posted on Jul 29, 2023 @ 3:10PM
రాష్ట్రంలో ఆబాలగోపాలానికి దూషణల స్వరం వినిపించడమే జగన్ లక్ష్యంగా ఆయన సభలు సాగుతున్నాయి. అవేమీ పార్టీ సభలు కాదు. ప్రభుత్వ సభలు. ఆ సభలకు ప్రేక్షకులు ఎవరు అన్న దానితో సంబంధం లేకుండా జగన్ విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడా విషయం మళ్లీ కొత్తగా ప్రస్తావించడం ఎందుకు అనుకుంటున్నారా?
విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ మెంట్, అమ్మఒడి, విద్యాదీవెన కిట్ల పంపిణీ వంటి సభలకు తరలిస్తున్నారు. అమ్మఒడి, విద్యా దీవెన కిట్లు పంపిణీ వంటి సభలకు పెద్ద ఎత్తున విద్యార్థులను తరలిస్తున్నారు. ఆయా సందర్భాలలో జగన్ ప్రసంగాలు ఆ కార్యక్రమానికి సంబంధించి కాకుండా విపక్ష నేతల పెళ్లిళ్లు కాపురాలు వంటి అంశాలపై ఉంటున్నాయి. విపక్ష నేతలను తూలనాడటంతో తన వాచాలతను చాటుకోవడానికి ఘనత వహించిన సీఎం జగన్ ఒకటో తరగతి పిలల్ని కూడా వదలడం లేదు. ముఖ్యంగా విద్యార్థులను తీసుకువచ్చి మరీ ఏర్పాటు చేసిన సభలలో జగన్ రోడ్డి ప్రసంగాలు పెళ్లాలు.. పెళ్లిళ్లు , కాపురాలు, కడుపులూ అంటూ వారిని పెడతోవ పట్టించేలా ఉంటున్నాయి.
జగన్ ఈ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు చిన్న పిల్లలను తరలించవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు ఉన్నా.. జగన్ పట్టించుకోవడంలేదు. దీంతో న్యాయవాది విశ్లేషకుడు జడ శ్రవణ్ కుమార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సభలకు పిల్లలను తరలించరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పొందుపరుస్తూ, జగన్ కురుపాంలో జగన్ నిర్వహించిన అమ్మఒడి సభ కు పిల్లల తరలింపుపై ఆర్టీఐ సమాచారంతో జడ శ్రవణ్ కుమార్.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం విచారించింది.
హైకోర్టు చీఫ్ జస్జిస్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జస్టిస్ ఠాకూర్ విచారించిన తొలి పిటిషన్ ఇదే. కేసు విచారణ సందర్భంగా పిల్లల్ని తరలించిన విషయాన్ని అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ , హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.
జగన్ నిర్ణయాలు, విధానాలే కాదు చివరాఖరికి ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాల సందర్భంగా చేసిన ప్రసంగాలు సైతం వివాదాస్పదమౌతున్నాయి. కోర్టుల ఎదుట న్యాయపరీక్షను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వానికీ, పార్టీకీ తేడా ఏముందన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్న తీరును పరిశీలకులు సైతం తప్పుపడుతున్నారు. ఇప్పుడు కోర్టులో జగన్ కార్యక్రమాలకు పిల్లలను తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాలు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. అదే విధంగా తాను చేసిన ప్రసంగాలపై కోర్టు ఎదుట వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి జగన్ కు ఎదురైందని పరిశీలకులు చెబుతున్నారు.