రిమాండ్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు...హైకోర్టు తీర్పు
posted on Oct 29, 2022 @ 4:09PM
అధికార తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు లో నిందితుల రిమాండ్ కు హైకోర్టు అనుమతించింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామిలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ాదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రామాలో పట్టుబడిన నిందితులకు 41 ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్ కు తరలించేం దకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వాదనలు విన్న తర్వాత నిందితులకు రిమాండ్ కు అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్ల కూరు సుమలత తీర్పు వెలువరించారు. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర చాలని ఆదేశించారు.
రిమాం డ్‌ను నిరాకరిస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు శుక్ర వారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు లంచ్ మోషన్‌ను తరలించడం ద్వారా ముందస్తు విచారణను కోరింది, అయితే కోర్టు రెగ్యులర్ పిటిషన్‌ను కోరింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్, సింహయాజి స్వామి అనే ముగ్గురు నిందితులను విడుదల చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పోలీ సులు సవాలు చేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి టీఆర్ ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఎరచూపించి బీజపీ పార్టీలోకి తీసుకు రావడానికి, పార్టీలో ఉన్నత పదవులతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయ త్నించారు. ఆ ముగ్గుకు వ్యక్తులను సరూర్ నగర్ లో న్యాయమూర్తి నివాసానికి గురువారం రాత్రి పోలీసులు తీసికెళ్లారు. కానీ నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపేం దుకు పోలీసులు చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.
నిందితులుగా పేర్కొన్న ముగ్గురు టీ ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి ఆకట్టుకోవడానికి చేసే యత్నం లో డబ్బు ఆశ చూపారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి పోలీసుల అభ్యర్ధ నను నిరాకరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని ఆయన అన్నారు.
కాగా,ఈ కేసు విషయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తెలంగాణా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మునుగోడు ఉప ఎన్నికలనేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేస్‌ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిష నర్ హైకోర్టును కోరారు. పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు.