ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రులే దోషులు
posted on Nov 25, 2013 @ 5:26PM
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు దోషులని ఘజియాబాద్ సిబిఐ కోర్ట్ నిర్ధారించింది. ఆరుషి, హేమరాజ్ ల జంట హత్య కేసులో తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.
2008 మే 16న ఆరుషి - హేమరాజ్‌ల హత్య జరిగిన విషయం తెలిసిందే. నిజానికి ఆరోజు ఆరుషి పదహారవ పుట్టినరోజు. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులు దోషులని సిబిఐ కోర్ట్ తీర్పును వెల్లడించింది.
కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్‌లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేయనుంది. పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించనున్నారు.ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని రాజేష్ తల్వార్ చెప్పారు.