రాష్ట్రాన్ని భయపెడుతున్న 'లెహర్'తుఫాన్
posted on Nov 25, 2013 @ 4:40PM
రాష్ట్రాన్ని వరుస తుఫానులు హడలెత్తిస్తున్నాయి. మొన్న 'ఫైలిన్', నిన్న 'హెలెన్', తాజాగా 'లెహర్' రాష్ట్రాన్ని భయపెడుతుంది. బంగాళాఖాతంలోకి ప్రవేశించిన 'లెహర్' పెనుతుఫాన్‌గా మారినట్లు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని, ఈ క్రమంలో కోస్తావైపుగా పయనించి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి కళింగపట్నం-మచిలీపట్నంల మధ్య కాకినాడ సమీపాన తీరం దాటుతుందని పేర్కొంది.
అండమాన్‌లో 'తుఫాన్' ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి తెలిపారు. మత్స్యకారులను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేసింది. విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఆదివారం అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది.
video courtesy etv 2