ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్.. లైంగిక ఆరోపణలు
posted on Sep 21, 2016 @ 4:22PM
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం.. అరెస్ట్ అవడం కామన్. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే గారి బంధువు అయిన ఓ మహిళ ఆయనపై లైంగిక వేదింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఖాన్ తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతపెడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే అందరూ చెప్పినట్టే ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనపై కుట్ర చేస్తున్నారని ఖాన్ ఆరోపించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆయనే నిన్న స్వయంగా జమియా నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కానీ పోలీసులు మాత్రం అతనిని అరెస్ట్ చేయకుండా తమ దర్యాప్తు ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి పంపించేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వారే స్వయంగా వెళ్లి.. ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.