ఎంబీబీఎస్ అమ్మాయి.. 9 వ క్లాస్ అబ్బాయి..
posted on Apr 8, 2021 @ 11:32AM
వాడు పిల్లోడే..కానీ కిలాడీగాడు.. కేడి గాడు.. అమాయకంగా కనిపించే అపరిచితుడు. మాయగాడు. మోసగాడు టెక్నాలజీ తో మోసం చేసే టక్కరోడు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.
ఆమె ఎంబీబీఎస్. ఆ పిల్లాడు 9వ తరగతి. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ఆమె తమ్ముడే కదా అనుకుంది. అందుకే అమాయకంగా కనిపించే పిల్లాడికి అప్పుడప్పుడు తన ఫోన్‌ను అతడికి ఇచ్చేదామె. పిల్లోడి కదా అనుకుంది. కానీ ఆ పిల్లాడు అమాయకపు మాటున ఆమెకు కాదు వేశాడు. ఆ తర్వాత తెలిసింది. వాడు మాత్రం పిల్లోడు కాదు పిడుగు అని.
కట్ చేస్తే కొద్దీ రోజుల తర్వాత వన్ ఫైన్ మార్నింగ్..ఆమె పేరుతో ఆన్‌లైన్ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ చేశారదు అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ అపరిచితుడు సినిమాలో విక్రమ్ రేంజ్ లో యాక్ట్ చేస్తూ వచ్చాడు.
ఈ మానసిక వేదనను చాలా రోజులపాటు భరించిన ఆ యువతి ఇక తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్ ఓపెన్ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్ ఓపెన్ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్ హోమ్‌కు తరలించారు. కాగా.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడు.
మీ ఇంటి పక్కింట్లోనో.. మీ ఎదురింట్లోనో ఇలాంటి వాళ్ళు లేకపోలేదు.. జెర భద్రం.. బతుకు పయిలం.. ఆగమరిచి నమ్మినారా ఇక అంతే మీ బతుకు చిందర వందర. ఎందుకంటే ఇపుడు ఉన్న రోజుల్లో మన నీడని కూడా మనము అనుమానించే పరిస్థితి దాపురించింది మరి. ఎంత క్లోజ్ గా ఉన్న సంత అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క లా ఉన్న వెంటనే కరిగిపోకండి.. ఆ తర్వాత మోసపోకండి.