పీఎం ఆవాజ్ యోజనకు 79 వేల కోట్లు
posted on Feb 1, 2023 @ 10:56AM
నిర్మలమ్మ తన బడ్జెట్ లో గృహ కొనుగోలు దారులకు తీపి కబురు చెప్పారు. కొత్త ఇళ్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ఒకింత వెలుసుబాటు కలిగేలా పీఎం ఆవాజ్ యోజనకు ఈ బడ్జెట్ లో నిధులు పెంచారు. గత బడ్టెజ్ లో ఈ పథకానికి 48వేల కోట్ల రూపాయలకు కేటాయించగా ఈ సారి దానిని 66శాతం పెంచి 79 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో గృహ కొనగోలు దారులకు ఇది కచ్చితంగా ఊరట కలిగిస్తుంది.
ఇక రైల్వేలకు కూడా భారీగానే కేటాయించారు. రైల్వేల కోసం ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ 2.04 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త రైల్వే జోన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే ఇన్ ఫ్రాస్టక్టర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక మూల ధనం కింద పది లక్షల కోట్లు కేటాయించారు.
అలాగే ట్రైబల్ ఏరియాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఏకలవ్య పారఠాలల్లో ఉపాధ్యాయ నియామకాలను భారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే కారాగారాల్లో మగ్గిపోతున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.