ఆమెకు 36 ఏళ్ళు.. ఆ యువకుడికి 17 ఏళ్ళు..
posted on May 21, 2021 @ 4:23PM
ఆమె వయసు 36 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే పెళ్లయింది.. ఏంటయ్యా సుందరం కొత్త కారు, కొంత బంగ్లా, కొత్త కాపురం అనే యాడ్ లా.. ఆమె కూడా కొత్త పెళ్లి, కొత్త కాపురం, కొత్త మొగుడు అని ఎన్నో ఆశలతో, కోరికలతో, కలలతో అత్తవారింటికి ఆడుగుపెట్టింది. కానీ ఆమె ఆశలు ఎంతో కాలం నిలవలేదు.. భర్త ఉద్యోగమని చెప్పి దుబాయ్ కి వెళ్ళిపోయాడు. ఇక అత్తమామలు తమ సొంత గ్రామానికి వెళ్లిపోయారు. ఇక అంత పెద్ద నగరంలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. అందరూ ఉన్న ఎవరూలేని మనిషిలా ఉండిపోయింది. తన బాధ చెప్పుకోవడానికి చుట్టూ గోడలు తప్పా.. ఆమె చుట్టూ ఎవరు లేకపోవడంతో ఆ మహిళ మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలు ఎదురుకున్నారు. ఇక అంతే ఆ ఒంటరి మహిళలో కోరికలు రేకెత్తాయి. చిన్న వయసులో పెళ్లి అవ్వడం వల్ల తన యవ్వనని అనుభవించలేకపోయింది. అందుకే ఎదురింట్లో కొత్తగా అద్దెకు దిగిన ఓ యువకుడి (17) పై కన్నేసింది. తన కోరికలను తీర్చడానికి ఇతడే సరైనవాడనుకొని అతనిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించింది.
యువకుడిని మచ్చిక చేసుకొని తన బాధను వివరించింది. తన కామ కోరికలు తీర్చాలని యువకుడిని కోరింది. మహిళ మాటలు విన్న యువకుడు ససేమిరా అని తేగేసిచెప్పాడు. ఇది తప్పని, తానూ అలాంటి కుర్రాడిని కాదని నచ్చజెప్పడానికి యువకుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆ మహిళ వినలేదు. తన కోరికలు తీర్చకపోతే చుట్టుపక్కల వారందరికీ తనపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించావని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నావని ఫిర్యాదుచేస్తానని బెదిరించింది.
తన పరువు పోతుందని బెదిరిపోయిన యువకుడు మహిళా చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పటినుండి రాత్రి, పగలు అని తేడాలేకుండా మహిళ, యువకుడిని వేధించడం మొదలుపెట్టింది. తన కామ కోరికలతో యువకుడ్ని టార్చర్ చేస్తోండేది. ఇక ఆ వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంకా మైనర్ బాలుడినేనని, తనవయస్సు 17 సంవత్సరాలు మాత్రమేనని, అయినా ఆ మహిళ తనను వదలడంలేదని తెలిపాడు. యువకుడి ఫిర్యాదుమేరకు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బెంగాల్ లో జరిగింది.