108 సమ్మె సైరన్
posted on Dec 15, 2022 @ 4:53PM
ఏపీలో ఆందోళన బాట పట్టని వర్గం లేదంటే అతి శయోక్తి కాదు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రైతులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ కూడా తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆందోళన బాట పడుతున్నారు.
ఇప్పుడు 108 సర్వీసుల కాంట్రాక్టు ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించారు. సకాలంలో వేతనాలు అందక నానా యాతనలూ పడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ మూడున్నరేళ్లలో నెరవేరలేదని వారు చెబుతున్నారు.
అంతే కాకుండా 108 నిర్వహణ సంస్థ కారణంగా పలు సమస్యలు ఎదురౌతున్నాయని వారు ారోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా వచ్చే నెల 15 తరువాత ఏ క్షణమైనా సమ్మె బాట పడతామని 108 కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు.