నితీష్ కుమార్’ కు కోపమొచ్చింది .. ఎందుకో తెలుసా?
posted on Dec 16, 2022 8:02AM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో మంఛి పేరున్న నాయకుడు. కాలం కలిసొస్తే, 2024లో ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అవినీతి అంతగా అంటని మంచి పరిపాలన దక్షుడు. రాజకీయ పొత్తులు, రాజకీయ సమీకరణలు మారినా ముఖ్యమంత్రి పీఠం చేజారకుండా కాపాడుకోవడంలో సిద్ద హస్తుడు. రాజకీయ చతురుడు. అటో మోడీ, షా,ఇటు లాలూ అండ్ ఫ్యామిలీ ఇద్దరినే తమ ఎత్తులతో చిత్తూ చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీలో శాశ్వతంగా సెటిలై పోగల రాజకీయ జిత్తుల మారి ‘నేత’. ఈ అన్నిట్నీ మించి, నితీష్ కుమార్’కు సౌమ్యుడు. సహనశీలి, స్నేహశీలి అనే మంచి గుర్తింపు వుంది.
అయితే, అంతటి మంచి మనిషికి కోప మొచ్చింది. అంతటి సహన శీలి, సౌమ్యుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది కూడా రాష్ట్ర శాసన సభలో... నితీష్ కుమార్ ఉగ్రరూపం ప్రదర్శించారు. అది కూడా నిన్నమొన్నటి వరకు తాను కూర్చున్న ముఖ్యమంత్రి పల్లకీని మోసిన, మాజీ మిత్ర పక్షం, ప్రస్తుత విపక్షం బీజేపీ నేతలపై , ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైరయ్యారు . భగ్గుమన్నారు. ఆయున నోటి నుంచి ఏకే 47 తూటాల వంటి మాటలు దూసుకొచ్చాయి.
అయితేమ ఇంతేకీ నితీష్ కుమార్ సార్’కు ఇంతలా కోపం ఎందుకొచ్చింది? అంటే అందుకు మందు కారణం. కాదు, ఆయన మందు తాగి, సభకు రాలేదు. కానీ, సంపూర్ణ మధ్య నిషేధం అమలులో ఉన్న రాష్టంలో, ఈ మధ్య కాలంలో కల్తీ మద్యం అమ్మకాలు ఎక్కువయ్యాయి. కల్తీ మద్యం తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగిన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సహజంగానే రాజకీయ దుమారం భగ్గుమంది. ఈ నేపధ్యంలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గడచిన రెండు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మద్యం మాటల యుద్ధం సాగుతోంది.ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.‘‘ఒకవేళ తాగితే చస్తారు’’ అని నితీశ్ నోరు జారారు.దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.కాగా, మద్యం సాగి సభకు వచ్చారా అంటూ సీఎం అసెంబ్లీలో గద్దించడంపై బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గి వయసు పెరుగుతుండటంతో ఆయనకు కోపం పెరుగుతోందని ఆ పార్టీ నేత గిరిరాజ్ సింగ్ విమర్శించారు. నితీష్ పని అయిపోయిందని, అందుకే కోపం ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు.
అయితే, అధికార ప్రతిపక్షాల మాటలు ఎలా ఉన్నప్పటికీ, బీహార్’లో నితీష్ కుమార్ బీజీపే తో తెగతెంపులు చేసుకుని,ఆర్జేడీతో చేతులు కలిపినా తర్వాత, ఆయన అసహనననికి గురవుతున్నడి నిజమే,ఆర్జేడీ, బీజేపీల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో నితీష్ లేగ దూడల నలిగి పోతున్నారు. అందుకే, చివరకు ఈ ఒక్కసారికి మాత్రమే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాని, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’ ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే ఆర్జేడీ, జేడీయు కూటమి ఎన్నికలకు వెళుతుందని ప్రకటించారని, అంటున్నారు.
నిజానికి, పొత్తులు మార్చి ముఖ్యమంత్రి కుర్చీని అంటిపెట్టుకుని కూర్చోవడం వలన నైతేనేమి, ఇతరత్రా కారణాల వలన చేతనేతే నేమి, నితీష్ కుమార్ చరిష్మా చాలా వరకు మసక బారింది. అలాగే, జేడీయు కూడా ఒక విధంగా క్షీణ దశకు చేరుకుంది, ఇప్పటికే థర్డ్ ప్లేస్’లో ఉన జేడీయు వచ్చే ఎన్నికల్లో బలం మరింత తగ్గి, పార్టీ కాలగర్భంలో కలిసి పోతుందని, అందుకే నితీష్ కుమార్’ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంతోందని పరిశీలకులు సైతం అంటున్నారు.