కూతురు కావాలంటూ.. తల్లికి వార్నింగ్ .
posted on Mar 18, 2021 @ 11:15AM
బస్టాండ్ అడ్డాగా వాళ్ళ స్నేహం. పరిచయం అయినా కొంత కాలానికే చాటింగ్ మొదలు పెట్టారు. అమ్మాయి స్నేహం అనుకుంది. అబ్బాయి మాత్రం ప్రేమ అనుకున్నాడు.. తన మనసులో మాట అమ్మాయి కి చెప్పాడు.. అందుకు అమ్మాయి అంగీకరించలేదు.
హైదరాబాద్ లోని బైరామల్ గూడకు చెందిన గుజ్జ శ్రీధర్ రెడ్డి అనే యువకుడికి 2012వ సంవత్సరంలో బస్టాప్ లో ఓ ఇంటర్ చదివే యువతి పరిచయం అయింది. పలుమార్లు బస్టాప్ లోనే కలవడంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వారిద్దరూ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహంగా భావించి ఆమెతో మాట్లాడుతూ ఫొటోలు, వీడియోలను గ్యాదర్ చేశాడు. అయిదేళ్ల పాటు స్నేహం నటించాడు. 2017వ సంవత్సరంలో ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. దీంతో ఆ యువతి అతగాడి ప్రపోజల్ ను తిరస్కరించింది. అతడి నిజస్వరూపం తెలియడంతే అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.
ఆమెతో మాట్లాడటం కుదరకపోవడంతో శ్రీధర్ కు పిచ్చెక్కినట్టయింది. అతను ఎలాగోలా ఆమె తల్లి ఫోన్ నెంబర్ ను తెలుసుకుని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు నేరుగా వాట్సప్ లో నీ కూతురు నన్నే ప్రేమించాలి. కాదని ఇంకెవరిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా, దాని పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. నా దగ్గర మీ అమ్మాయి ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతా. మీ పరువు తీస్తా. నన్ను కాదంటే మీ అమ్మాయికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా‘ యువకుడు బెదిరింపు మెసేజ్ ను పంపాడు. ఆ మెసేజ్ ను చూసిన ఆమె కంగుతింది. కూతురిని అడిగి అసలు విషయం కనుక్కుంది. ఆ తర్వాత రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు శ్రీధర్ ను అరెస్ట్ చేశారు. అతగాడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియో ఆధారాలను ధ్వంసం చేశారు. అతడిని రిమాండ్కు పంపించారు.
ప్రేమిస్తే పేమించాలి గానీ నన్ను ప్రేమించకపోతే పరువు తీస్తా.. చంపేస్తా అనడం ఎందుకు..ఈ మధ్య కాలం లో ఫ్యాషన్ అయిపోయిందని. ఇలాంటి దారుణాలు మరి ఎక్కువ అవుతున్నాయని.. ఒక అమ్మాయి ప్రేమించకపోతే వదిలెయ్యని కానీ ఇలా టార్చెర్ చేయడం సరికాదని. అమ్మాయి ప్రేమించలేదని ప్రాణాలు తీసుకోవం. ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అని స్థానికులు అంటున్నారు.