రాహుల్‌ని చంపే పనిలేనోడెవరు?

 

 

 

పాపం రాహుల్‌గాంధీ తననుతాను ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకునే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టున్నాడు. అలాంటి వ్యాధేదో లేకపోతే తన నాయనమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ తరహాలోనే తనను చంపే కుట్ర జరుగుతోందని కామెడీ స్టేట్‌మెంట్ ఇవ్వడు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యల వెనుక చాలా హిస్టరీ వుంది. బలమైన కారణాలు, తీవ్రమైన ఉద్యమాలు ఉన్నాయి. మరి రాహుల్‌గాంధీ వెనుక ఏ హిస్టరీ వుంది?


రాజీవ్, సోనియాగాంధీల కొడుకుగా పుట్టడం తప్ప రాహుల్ గాంధీకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన ప్రాణాలకు తెగించి డీల్ చేసిన ఇష్యూలేంటి? ఎవరో కక్షకట్టి చంపాల్సినంత తీవ్రమైన సమస్యల్ని వేటిని రాహుల్ డీల్ చేశాడు? చంపాల్సినంత సీన్ లేని రాహుల్‌గాంధీని చంపడానికి ప్రయత్నించే పనిలేనోడు ఎవడుంటాడు? తన ప్రవర్తనతో రాహుల్ గాంధీ దేశంలో జనాన్ని చచ్చేలా నవ్వేలా చేస్తున్నాడు.

ఇలాంటి కామెడీ కేరెక్టర్ రాహుల్ గాంధీని ఎవరైనా చంపుతారా? ఇండియాలో ప్రస్తుతానికి రాహుల్‌గాంధీని చంపాల్సిన అవసరం ఎవరికీ కనిపించడం లేదు. ఒకవేళ ఎక్కడో స్పెయిన్లో వున్న రాహుల్‌గాంధీ లవర్ వెరోనికా తాలూకు వాళ్ళెవరికైనా ఆ అవసరం ఉందేమో రాహులే ఆలోచించుకోవాలి. నాయనా రాహుల్ గాంధీ భారతీయులెవరూ నిన్ను చంపే అవకాశం లేదు. కాబట్టి ప్రశాంతంగా నిద్రపో. నోటికొచ్చిన స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా దేశాన్ని ప్రశాంతంగా వుంచు.

Teluguone gnews banner