సోనియాగాంధీ మాటిస్తే అంతే
posted on Aug 28, 2013 @ 7:02PM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారని మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆమె మాటకు తిరుగులేదని అన్నారు. దేశ ప్రజల కోసం పట్టుపట్టి ఆహార భద్రత బిల్లుకు తీసుకువచ్చి, దానికి చట్టరూపం కల్పించిన సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర విభజన జరిగిపోయిదని, కాబట్టి సీమాంధ్రుల్ర సహకరించాలని గీతారెడ్డి కోరారు. అలాగే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో బిల్లుపెట్టి త్వరగా లమలు చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలతో సయంమనంతో, స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నామని గీతారెడ్డి తెలిపారు. పదేళ్ళ ఉమ్మడి రాజధానికి సహృదయంతోనే ఒప్పుకున్నామని అన్నారు. అవసరమైతే మళ్ళీ అంటోనీ కమిటీని కలుస్తామని చెప్పారు. పరస్పర దాడులుసరికాదని ఆమె అన్నారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నప్పుడు సీమాంద్రులు నగరంలో సభలు, సమావేశాలు పెట్టకూడదని ఎందుకు చెబుతామని గీతారెడ్డి అన్నారు. సభల వ్యవహారం, శాంతభద్రతల వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని ఆమె అన్నారు.