అధికారులను కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్
posted on Aug 28, 2013 @ 8:58PM
చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి హైదరబాద్‌లో చోటు చేసుకుంది పోలీస్ శాఖ ప్రక్షలన చేస్తానంటున్న ఓ వ్యక్తి ముగ్గుకు అధికారులను కిడ్నాప్ చేశాడు. దీంతో ఒక్కసారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉలిక్కి పడింది. గతంలో కూడా ఓ పిటివో అధికారిని కిడ్నాప్ చేసిన శర్మ అనే వ్యక్తి ఈ సారి కూడా కిడ్నాప్‌కు పాల్పడ్డాడు.
ముగ్గురు అధికారులను తాను కిడ్నాప్ చేసినట్టుగా శర్మ ప్రకటించాడు. వారిలో ఇద్దరు పిటివో అధికారులు కాగా ఒకరు బిజెపి ప్రతినిథి. సదరు పిటివో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని అందుకే వారిని కిడ్నాప్ చేశానని శర్మ తెలిపాడు. ప్రత్యేక రాయలసీమ కోరుతున్నందుకు గాను బిజెపి ప్రతినిధిని కిడ్నాప్ చేశానని చెపుతున్నాడు.
అయితే గతంలో కూడా ఇలాంటి చర్యలతొ వివాదాస్పదమైన శర్మ కేవలం పబ్లిసిటి కోసమే ఇలాంటి చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇప్పటికే అప్రమత్తమయిన పోలీసులు కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు.