పారిస్ మారణహోమంపై పలువురి స్పందనలు..
posted on Jul 15, 2016 @ 11:13AM
ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన మారణకాండపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాస్టిల్ వేడుకల్లో మునిగిఉండగా.. ఓ ఉగ్రవాది అత్యంత కిరాతకంగా ఓ ట్రక్కును వారిపై నుండి పోనివ్వడంతో దాదాపు 80 మంది మరణించారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ప్రణబ్ ముఖర్జీ
పారిస్ దాడి విషయం తెలిసి షాక్ కు గురైనట్టు తెలిపారు. ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మోడీ..
ప్రధాని నరేంద్రమోదీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇదో మతిలేని చర్య అని.. ఉగ్రవాదులను అరికట్టాలని అన్నారు. ఇంకా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బరాక్ ఒబామా..
పారిస్ పై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఫ్రాన్స్ కు భారత్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్..
పారిస్ ఘటనపై స్పందించిన ట్రంప్ ఉగ్రవాదులపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన రేపు జరగాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారు.