సూడాన్ నుంచి భారత్ కు క్షేమంగా...
posted on Jul 15, 2016 @ 10:32AM
దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ సక్సెస్ అవ్వడంతో అక్కడ ఉన్న భారతీయులను ఇండియాకు తరలించారు. కేంద్రమంత్రి వీకే సింగ్ స్వయంగా రంగంలోకి దిగి.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపిన వీకే సింగ్ చిక్కుబడ్డ 600 మంది భారతీయులను సురక్షితంగా విమానం ఎక్కించారు.
కాగా వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17 విమానం కొద్దిసేపటి క్రితం తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. కాగా ప్రభుత్వం రక్షించి తీసుకొచ్చిన వారిలో 46 మంది కేరళీయులు కాగా ఇద్దరు నేపాల్ దేశస్థులు, ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మిగతా వారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు. అయితే ఇప్పటి వరకు 500 మంది భారతీయులను రక్షించగా మరో 300 మంది వ్యాపారాల కారణంగా అక్కడ ఉండేందుకే మొగ్గు చూపినట్టు సమాచారం.